ఫైమాకి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన పటాస్ ప్రవీణ్!
on Dec 10, 2022
.webp)
బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి ఇంటికి వచ్చేసిన ఫైమాకి తన మిత్రుడు పటాస్ ప్రవీణ్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాడు. స్పెషల్ గిఫ్ట్ తో ఆమెను సర్ప్రైజ్ చేసాడు. ముందుగా ఒక కేక్ కట్ చేసి ఫైమాకి తినిపించాడు.
తర్వాత ఫైమా కూడా ప్రవీణ్ కి వాళ్ళ అమ్మకు తినిపించింది. ఆ తర్వాత కడపకు వెళ్లి అక్కడి దర్గా నుంచి హోలీ వాటర్ తీసుకొచ్చి ఫైమా చేతికి ఇచ్చాడు. గిఫ్ట్ అంటే ఏదో అనుకునేవు ఈ హోలీ వాటర్ నే నీకు గిఫ్ట్ గా ఇస్తున్నా. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా చేయగలం అందుకే ..అని చెప్పాడు. ఇక తన మెడలోని గోల్డ్ చైన్ కూడా ఫైమాకి ఇచ్చాడు. ఫైమాని చూస్తుంటే తనకు చాలా భయమేస్తోందని చెప్పాడు. ఎందుకంటే హౌస్ లో అందరితో ఫైట్ చేసి వచ్చింది కదా తనను కూడా ఏమన్నా అంటుందేమో అని భయం వేసిందట.
ఇక ఫైమా హౌస్ లో బాగా ఆడిందని..ఇన్ని రోజులు హౌస్ లో ఉండడం చాలా గ్రేట్ అని హోస్ట్ నాగార్జున ఫైమా ఆటను మెచ్చుకోవడం చాలా సంతోషం అని తన కూతురు ఫైమా గురించి చెప్పి సంబరపడింది వాళ్ళ అమ్మ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



